Site icon NTV Telugu

Tirumala Hundi Collection: తిరుమల హుండీ రికార్డు.. వరుసగా 8వ మాసంలోనూ..

Tirumala Hundi

Tirumala Hundi

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.. భక్తుల తాకిడితో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కరోనా సమయంలో పడిపోయిన హుండీ ఆదాయం ఆ తర్వాత ఏ నెల తీసుకున్నా రూ.100 కోట్ల మార్క్‌ కంటే తక్కువగా వచ్చిందే లేదు.. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 4.18 కోట్లు రాగా… వరుసగా 8వ మాసంలోనూ 100 కోట్ల మార్క్ దాటేసింది తిరుమలేశుడి హుండీ ఆదాయం.. అక్టోబర్ మాసంలో హుండీ ద్వారా శ్రీవారికి 122.8 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. గత మార్చి మాసం నుంచి వరుసగా 100 కోట్ల మార్క్ ని దాటుతూ వస్తోంది శ్రీవారి హుండి ఆదాయం.. కాగా, గత జులై మాసంలో అత్యధికంగా హుండీ ద్వారా రికార్డు సంఖ్యలో శ్రీవారికి రూ.139.35 కోట్ల ఆదాయం వచ్చిన విషయం విదితమే..

Read Also: Kanna Lakshmi Narayana: సీఎం జగన్‌కు కన్నా బహిరంగ లేఖ..

Exit mobile version