Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి వెళ్లిన పవన్ కల్యాణ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.. ఆ తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. 11 రోజుల పాటు దీక్షను కొనసాగంచిన విషయం విదితమే.. అయితే, శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారట పవన్ కల్యాణ్.. స్వామివారి దర్శనం.. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్.. దీంతో.. వారాహి డిక్లరేషన్ బుక్‌లో ఏముందు? అనే చర్చ సాగుతోంది..
Read Also: Devara : తెలుగు రాష్ట్రాల 5 రోజుల కలెక్షన్స్.. దుమ్ములేపేసాడు..!
రెడ్ కలర్‌లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీపై.. పై భాగంలో !! ధర్మో రక్షతి రక్షితః !!.. మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్.. కింది భాగంలో తిరుపతి 03-10-2024 అని రాసుకొచ్చారు.. దీంతో.. ఆ బుక్‌లో ఎలాంటి అంశాలు పొందుపర్చారనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, రేపటి వారాహి సభలో వారాహి డిక్లరేషన్ బుక్‌లోని అంశాలను ప్రజలకు పవన్ కల్యాణ్ తెలియజేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని బాలాజీ కాలనీ సర్కిల్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ దగ్గర ఎస్వీయూ క్యాంప్ స్కూల్‌లో వారాహి బహిరంగ సభను జరగనుంది.. ఈ బహిరంగ సభలో వారాహి వాహనం నుంచి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..