Site icon NTV Telugu

TTD: కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇవాళ్టి నుంచి అమలు..

Ttd

Ttd

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్‌ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెల టిక్కెట్లు పొందిన భక్తులకు యథావిథిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను నవంబర్ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో 800 టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టిక్కెట్లు జారీ చేయనుంది టీటీడీ.

Read Also: CM Chandrababu Kadapa Tour: నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు

ఇకపై ఏ రోజుకు ఆ రోజు దర్శన టిక్కెట్లు జారీ చేయనున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 7 గంటల నుండి, తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు ఇస్తారు. మొత్తంగా ఇవాళ్టి నుంచి శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.. ఆఫ్ లైన్ విధానంలో ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది టీటీడీ.. ఇవాళ్టి నుంచి శ్రీవాణి భక్తులను సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతించనుంది.. ఆఫ్ లైన్ విధానంలో తిరుమలలో 800.. రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు జారీ చేస్తారు.. తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి.. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉంచుతారు.. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించనున్న టీటీడీ. నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.

Exit mobile version