Site icon NTV Telugu

TTD: విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్.. 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు..!

Ttd

Ttd

TTD: విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్‌ ఇచ్చింది.. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది టీటీడీ.. 15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని ఆదివారం రోజు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది టీటీడీ.. అయితే, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని విశాఖ శారదా పీఠంపై ఆరోపణలు వచ్చాయి.. అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లాయి హిందూధర్మ పరిరక్షణ సమితి సంఘాలు.. కోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో చర్యలకు దిగిన టీటీడీ అధికారులు.. అందులో భాగంగా.. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలంటూ తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు..

Read Also: Rythu Mahotsavam 2025: నేటి నుంచి రైతు మహోత్సవం.. 5 జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు!

తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ గతంలోనూ విశాఖ శారదా పీఠానికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది టీటీడీ.. కానీ, దీనిపై కోర్టును ఆశ్రయించింది శారదా ఫీఠం.. మొదట స్టే రాగా.. తర్వాత జరిగిన విచారణలో టీటీడీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో ఎలాంటి తప్పు లేదంటూ పేర్కొంది కోర్టు.. దీంతో, 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి అప్పగించాలని తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు టీటీడీ అధికారులు.. అయితే, దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.. భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన మొదట ప్రకటించిన టీటీడీ.. ఆ తర్వాత భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది..

Exit mobile version