NTV Telugu Site icon

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌పై టీటీడీ నిర్ణయం అదేనా..?

Ttd

Ttd

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది. అది కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పరిమిత సంఖ్యలోనే టిక్కేట్లు కేటాయిస్తుండడంతో విరాళం కూడా పరిమితమవుతుంది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకి వెయ్యి టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తూండగా. ఈ మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ కారణంగా టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది. ఇక ట్రస్ట్ ద్వారా కేటాయించే టిక్కేట్ల పై నియంత్రణ ఎత్తివేసింది. దీంతో రోజుకి 2800 వరకు టిక్కెట్లను భక్తులు కొంటున్నారు. అయితే.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కేటాయించే టిక్కెట్ల సంఖ్య పెరిగితే సామాన్య భక్తులుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని గమనించిన టీటీడీ టికెట్ల సంఖ్యను రోజుకు 1500కు పరిమితం చేసింది.

Read Also: Telangana Assembly 2024: ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులపై చర్చ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం..

ఆన్ లైన్ విధానంలో 500 టిక్కెట్టు.. ఆఫ్ లైన్ విధానంలో 900 టిక్కెట్లు, తిరుపతి ఎయిర్‌పోర్టులో మరో 100 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తుంది. దీంతో బోర్డుకు నెలకు 40 నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి 509 కోట్ల వరకు విరాళాలు అందనున్నాయి. టిటిడి నిర్వహిస్టున్న అన్ని పథకాలుకు అందే విరాళాలు 250 కోట్లకు పరిమితం అవుతుంటే..! శ్రీవాణి ట్రస్ట్‌కి అందే విరాళాలు మాత్రం అంతకు రెట్టింపుగా అందుతుంది. ఇక, దీనిపై ఎన్నికలకు ముందు పలు విమర్శలు వచ్చాయి. ఒక దశలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు ప్రక్కదారి పడుతున్నాయని ప్రధాన పార్టీ అధ్యక్షులే ఆరోపణలు చెయ్యడంతో.. ఎన్నికల తరువాత శ్రీవాణి ట్రస్ట్ కోనసాగుతుందా? అన్న అనుమానాలు తల్లేత్తాయి. ప్రభుత్వం మారడం.. టీటీడీకి కొత్త ఉన్నతాధికారులు వచ్చారు. ఈ టైమ్‌లో అందరి దృష్టి శ్రీవాణి ట్రస్ట్‌పైనే పడింది. ఇక ట్రస్ట్ కోనసాగింపుకే మొగ్గు చూపుతున్న సంకేతాలు అందుతున్నాయి. టీటీడీ ఇఓగా శ్యామలరావు, అడిషనల్ ఇఓగా వెంకయ్య చౌదరి భాధ్యతలు చెపట్టిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ పై పరిశీలన చేశారు. భక్తులకు సౌకర్యాలను మరింతగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. టికెట్ల సంఖ్యను కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విరాళాలు అందించే వారికి సౌకర్యవంతంగా వుండేలా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతోంది. ఇలాం ఆదాయ వనరుగా ఉన్న శ్రీవాణి ట్రస్ట్ కోనసాగింపుకే టీటీడీ మొగ్గు చూపుతుంది.