NTV Telugu Site icon

Tirumala: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. టికెట్లు విడుదల చేసేది ఎప్పుడంటే..?

Ttd Eo Syamalarao

Ttd Eo Syamalarao

Tirumala: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌ చేయనున్నట్టు వెల్లడించారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్‌డీ టోకెన్లు కేటాయిస్తాం అన్నారు.. తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తాం అన్నారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు.

Read Also: Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!

అయితే, టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తాం అన్నారు ఈవో శ్యామలరావు.. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు.. కానీ, దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు అని స్పష్టం చేశారు.. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి.. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తాం అన్నారు.. ఇక, గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు టీటీడీ ఈవో శ్యామలరావు.