Divvela Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ, మాధురి ఫోటోలు దిగారు. కాగా, ఆ ఫొటోషూట్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టేసింది. ఆమెపై తిరుమల పోలీసులు కేసు ఫైల్ చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం దగ్గర ఫోటో షూట్ చేసినట్టు దివ్వెల మాధురిపై ఈ ఆరోపణలు వచ్చాయి.
Read Also: Gujarat Gang-Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. విచారణ సమయంలో నిందితుడి మృతి..
ఈ నేపథ్యంలో తిరుమలలో రీల్స్ చేయడంపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.. దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.