Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా భక్తులు రూ.25.79 కోట్లను కానుకలుగా సమర్పించగా, 2.44 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 22.6 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. మొత్తం 34.34 లక్షల లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు దేశంలోని 26 రాష్ట్రాలతో పాటు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలతో ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాలను 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్‌తో సుందరంగా అలంకరించారు. ఈ కన్నుల పండుగను భక్తుల గోవింద నామస్మరణ మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.

