TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!

  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
  • ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ప్రకటన
  • శ్రీవారి దర్శనం, తిరుమల వసతి కోసం సిఫార్సు లేఖలకు అనుమతి లేదు
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం నిబంధనల ప్రకారం మినహాయింపు
  • ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే దర్శనం, వసతి సౌకర్యాలు
  • వారి తరఫున ఇతరులు తీసుకొచ్చే సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టత...
Ttd

Ttd

TTD Alert: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ అధికారిక ప్రకటన ప్రకారం.. శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతి కోసం ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల సిఫార్సు లేఖలకు ఇకపై అనుమతి ఉండదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతకాలం ఈ నిబంధన కొనసాగుతుందని తెలిపింది.

అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా తిరుమలకు వస్తే నిబంధనల ప్రకారం వారికి దర్శనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. వారి తరఫున ఇతరులు తీసుకొచ్చే సిఫార్సు లేఖలను మాత్రం స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి, సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా తమ పర్యటనను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.