NTV Telugu Site icon

Tirupati Stampede Live Updates: తిరుపతిలో తొక్కిసలాట.. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

Tpt

Tpt

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్దకు భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్..

  • 09 Jan 2025 07:56 PM (IST)

    50 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలి: జగన్

    తిరుపతి ఘటన ప్రభుత్వం చేసిన తప్పు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తప్పిదం వల్ల తొక్కిసలాట జరిగింది. 50 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలి. బాధితులకు వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. ముఖ్యమంత్రి, హోం మంత్రి, దేవాదాయ మంత్రి, టీటీడీ అధికారులు అందరూ బాధ్యులే. ఆరుగురి చావుకు కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలి.

  • 09 Jan 2025 07:53 PM (IST)

    సీఎం చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు: జగన్ మోహన్ రెడ్డి

    ఒకే చోట తొక్కిసలాడే జరిగిందని చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. విష్ణు నివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. బైరాగి పట్టెడలో ఐదుగురు చనిపోయారని ఎఫ్ఆర్ లో ఉంది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఆసుపత్రిలో 35 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 50 నుండి 60 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థను నడుపుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

  • 09 Jan 2025 07:50 PM (IST)

    ఒక్కసారిగా పార్క్ గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట: జగన్ మోహన్ రెడ్డి

    ఒక్కసారిగా బైరాగి పట్టెడ పద్మావతి పార్కులో గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులు భారీగా వస్తుంటే క్యూ లైన్లు ఎందుకు పెట్టలేదు. క్యూలైన్లో భక్తులను పంపేందుకు పోలీసులు లేరు. జనాన్ని గుంపులుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది.

  • 09 Jan 2025 07:47 PM (IST)

    తిరుపతి ఘటనపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

    తిరుపతిలో తొక్కిసలాట ఘటన ఎప్పుడు జరగలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాదిమంది దర్శనానికి వస్తారని తెలుసు. విషయం తెలిసిన కూడా ఎందుకు టికెట్ కౌంటర్ల దగ్గర భద్రత పెంచలేదు. ఈ ఘటనకు టీటీడీ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందులో భాగస్వాములె.

  • 09 Jan 2025 07:01 PM (IST)

    తప్పు జరిగింది.. పూర్తి భాధ్యత తీసుకుంటున్నాం: డిప్యూటీ సీఎం

    పోలీసులు క్రౌడ్ మానేజ్ చేయడంలో విఫలమవుతున్నారు. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మొస్తుంది. వ్యక్తిగతంగా నన్ను కలచి వేసింది. ఇంతమంది అధికారులు ఉండి కూడా ఆరు ప్రాణాలు పోవడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాం. తప్పు జరిగింది.. భాధ్యత తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

  • 09 Jan 2025 06:52 PM (IST)

    స్విమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్న జగన్

    తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు తిరుపతి నగరంలోని స్విమ్స్‌ హాస్పిటల్ కు జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న జగన్.

  • 09 Jan 2025 06:41 PM (IST)

    టీటీడీలో ప్రక్షాళన జరగాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    విఐపిలను కాదు.. సామాన్యుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలి. టీటీడీ ఈవోకు అడిషనల్ ఈవోకు మధ్య గ్యాప్ ఉంది. ఈవో, అడిషనల్ ఈవో, అధికారులకు వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం. పోలీసుల్లో కొందరు కావాలని వ్యవహరించినట్లు బాధితులు తెలిపారు. దీని పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. తప్పు జరిగింది క్షమించండిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

  • 09 Jan 2025 06:38 PM (IST)

    తిరుపతి ఘటన నేపథ్యంలో అధికారులు సస్పెండ్

    డీఎస్పీ రమణ కుమార్, ఎస్వి గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

  • 09 Jan 2025 06:31 PM (IST)

    తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ: సీఎం చంద్రబాబు

    కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపడతారు. కొంతమంది అధికారులు వారికి అప్పగించిన టాస్కులు సరిగా చేయలేదు. అరగంట ముందుగా భక్తులను క్యూ లైన్ లో పంపి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. డీఎస్పీ అనాలోచిత వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగింది. దేవుడి పవిత్రతను దెబ్బతీసేందుకు ఇలా చేశారేమోనని అనుమానాలు ఉన్నాయి.

  • 09 Jan 2025 06:17 PM (IST)

    తప్పు జరిగింది క్షమించండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    ఇంతమంది అధికారులు ఉన్న ఆరుగురు ప్రాణం పోవడం సరికాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్ చేయలేరా అంటూ ఫైర్. ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారంటూ పవన్ వ్యాఖ్యానించారు.

  • 09 Jan 2025 06:14 PM (IST)

    మృతుల కుటుంబాలకు 25 లక్షలు, కాంట్రాక్టు ఉద్యోగం: సీఎం చంద్రబాబు

    తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తాం. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నేను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదు.

  • 09 Jan 2025 06:11 PM (IST)

    వెంకటేశ్వర స్వామి భక్తి పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

    భక్తులలో వెంకటేశ్వర స్వామి భక్తి పెరుగుతోందని, శ్రీవారిని దర్శనం చేసుకోవాలని వారు రోజురోజుకి పెరుగుతున్నారన్నారు సీఎం చంద్రబాబు.

  • 09 Jan 2025 06:09 PM (IST)

    తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే: సీఎం చంద్రబాబు

    రాజకీయాలకు అతీతంగా శ్రీవారి సేవ చేస్తున్నామని భావన ఉండాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాదిమంది కోరిక. కొండపై ఉన్న సమయంలో 36 గంటలైనా క్యూలో ఉంటామని చాలామంది భక్తులు చెబుతున్నారు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం అనే సంప్రదాయం తీసుకురావడం కరెక్ట్ కాదని భక్తులు చెబుతున్నారు. ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసుకువచ్చింది. వైకుంఠ ద్వారం దర్శనాలను 10 రోజులపాటు అనుమతిస్తున్నారు. ఈ పది రోజులు దర్శనాలు కొనసాగించాల వద్ద అనేది ఆగమ పండితుల నిర్ణయం అని సీఎం చంద్రబాబు అన్నారు.

  • 09 Jan 2025 06:01 PM (IST)

    స్విమ్స్‌ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తున్న జగన్

    కాసేపట్లో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నారు. ఆయన తిరుచానూరు క్రాస్‌ నుంచి నడుచుకుంటూ స్విమ్స్‌కు చేరుకుంటున్నారు. ఆసుపత్రిలో తిరుపతి తొక్కిసలాట బాధితులను పరామర్శించనున్నారు జగన్‌.

  • 09 Jan 2025 05:57 PM (IST)

    తిరుపతిలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్

    పవిత్రమైన దివ్య క్షేత్రంలో ఏదైనా జరగకూడదో అలాంటి సంఘటన జరిగింది. బుధవారం నాడు వైజాగ్ లో ప్రధాని రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్, ఇనాగ్రేషన్స్ చేశారని తెలిపారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతికి చేరుకున్న సమయంలో ఈ వార్త తెలిసినట్లు తెలిపారు. ఈ విషయంతో మనసు పూర్తిగా కలిచివేసిందని, చాలా బాధపడుతున్నట్లు సీఎం అన్నారు.

  • 09 Jan 2025 05:33 PM (IST)

    రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్

    తిరుపతిలో జరిగిన భక్తుల తోపులాట గడ్డంలో భాగంగా క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఈ నేపథంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామర్శించనున్నారు.

  • 09 Jan 2025 05:30 PM (IST)

    టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం

    తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట ఘటన, రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరులు, ఎస్పీ సుబ్బారాయుడు, మంత్రులు సత్యకూమార్, నిమ్మల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • 09 Jan 2025 04:41 PM (IST)

    స్విమ్స్ హాస్పిటల్‌కి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    తిరుపతి ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నగరంలోని స్విమ్స్ హాస్పిటల్‌లో పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

  • 09 Jan 2025 04:32 PM (IST)

    ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.

    తిరుపతి ఘటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నగరంలోని స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించానంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత టీటీడీ పాలక భవనానికి చేరుకున్న సీఎం.

  • 09 Jan 2025 03:56 PM (IST)

    తొక్కిసలాట ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటన స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రమాద స్థలం పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

  • 09 Jan 2025 02:24 PM (IST)

    ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి: అంబటి

    అధికారులను తిట్టి తన పనైపోయిందంటూ చంద్రబాబు భావిస్తున్నారు.. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.. ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి: మాజీ మంత్రి అంబటి రాంబాబు

  • 09 Jan 2025 02:22 PM (IST)

    అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు: అంబటి

    తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం జరిగింది.. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో ఈ ఘటనకు ప్రధాన కారణం.. అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు.. గతంలో జగన్ కొండ మీదకు వస్తానంటే పెద్ద బోర్డులు పెట్టారు.. భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు.. అధికారులపై కోపాన్ని చూపించి చంద్రబాబు ఏం సాధించారు..

  • 09 Jan 2025 02:18 PM (IST)

    తొక్కిసలాటపై ముందస్తు సమాచారం ఏమైనా ఉందా: సీఎం చంద్రబాబు

    ఒక సెంటర్లో గేట్లు ఓపెన్ చేస్తే మరో సెంటర్ కు ఎలా తెలిసింది.. దీనిపై మీకు సమాచారం ఉందా.. ఏర్పాట్లపై వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారా..వాట్సాప్ గ్రూప్ లలో మెసేజ్ లు ఏమైనా పెట్టారా.. తొక్కిసలాటపై ముందస్తు సమాచారం ఏమైనా వచ్చిందా: సీఎం చంద్రబాబు

  • 09 Jan 2025 02:15 PM (IST)

    భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే మీరేం చేశారు: చంద్రబాబు

    జేఈవో గౌతమిపైనా సీఎం చంద్రబాబు సీరియస్.. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తు లేదా అని ప్రశ్నించిన సీఎం చంద్రబాబు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలియాదా?.. భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే మీరేం చేశారు.. కనీసం వాట్సాప్ గ్రూప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా: సీఎం చంద్రబాబు..

  • 09 Jan 2025 02:08 PM (IST)

    టీటీడీ ఈవోపై మండిపడిన సీఎం చంద్రబాబు

    గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు.. ఎవడో చేశాడని నువ్వు అలానే చేస్తావా: సీఎం చంద్రబాబు.. నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించిన చంద్రబాబు.. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేని ఈవోను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు..

  • 09 Jan 2025 02:04 PM (IST)

    కొత్త ప్లేస్ లో కౌంటర్లు పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి..

    2 వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారు.. కొత్త ప్లేస్ లో కౌంటర్లు పెట్టినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కదా: సీఎం చంద్రబాబు

  • 09 Jan 2025 02:02 PM (IST)

    అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..

    కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్.. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం.. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చకోండి..

  • 09 Jan 2025 01:50 PM (IST)

    తొక్కిసలాట ఘటన ప్రదేశంలో సీఎం చంద్రబాబు..

    తిరుపతిలోని తొక్కిసలాట ఘటన స్థలానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. తొక్కిసలాటకు గల కారణాలను వివరిస్తున్న మంత్రులు, అధికారులు..

  • 09 Jan 2025 01:32 PM (IST)

    కాసేపట్లో ఘటన ప్రదేశానికి సీఎం చంద్రబాబు

    తిరుపతి: రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు.. కాసేపట్లో ఘటన స్థలానికి సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై అధికారల నుంచి వివరాలు తెలుసుకోనున్న సీఎం..

  • 09 Jan 2025 01:20 PM (IST)

    కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు

    రుయాలో కోలుకుంటున్న తొక్కిసలాట ఘటన బాధితులు.. కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. రుయాలో బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి..

  • 09 Jan 2025 01:12 PM (IST)

    బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

    ఆస్పత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. గాయపడ్డవారు కోలుకుంటున్నారు.. తొక్కిసలాట కారణాలేంటో దర్యాప్తులో తేలుతుంది: మంత్రి సత్యకుమార్

  • 09 Jan 2025 12:54 PM (IST)

    బాధ్యుతలపై క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి: రోజా

    తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలి.. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ?.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు: మాజీ మంత్రి రోజా

  • 09 Jan 2025 12:49 PM (IST)

    టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట..

    తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం, టీటీడీ బాధ్యత వహించాలి.. టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శనం.. లడ్డూలో కల్తీ జరగపోయినా తప్పుడు ప్రచారం చేశారు.. తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశాం.. చంద్రబాబు అసమర్థతఈ ఘటనతో స్పష్టమైంది.. భక్తులకు కనీస సదుపాయలు కల్పించలేదు.. ఘటనకు కారణం ఎవరో కనుక్కోకుండ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు: మాజీ మంత్రి రోజా

  • 09 Jan 2025 12:34 PM (IST)

    తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: శ్రీనివాస్ గౌడ్

    తిరుపతి లో జరిగిన ఘటన దురదృష్టకరం.. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను.. తెలంగాణలో ప్రతి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి.. తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు తిరుపతి వెళ్తారు.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.. తెలంగాణలో టీటీడీ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయండి.. గాయాల పాలైన వారికి మంచి చికిత్స అందించండి.. మీరు వైద్యం అందించలేక పోతే.. హైదరాబాద్ కు పంపండి.. మేము దగ్గరుండి వైద్యం అందిస్తాం- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • 09 Jan 2025 12:31 PM (IST)

    పద్మావతి కాలేజీ వద్ద భారీ పోలీస్ బందోబస్తు..

    తిరుపతి: పద్మావతి మెడికల్ కాలేజీ వద్ద భారీ పోలీస్ బందోబస్తు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత..

  • 09 Jan 2025 12:24 PM (IST)

    తొక్కిసలాట ఘటనలో డీస్పీని బకరా చేస్తున్నారు: బీవీ రాఘవులు..

    తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారు.. బకరాను వదిలిపెద్ద పులులను పట్టుకోండి.. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలి.. ప్రధాని మోడీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారు.. 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా?.. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి: బీవీ రాఘవులు

  • 09 Jan 2025 12:18 PM (IST)

    తొక్కిసలాట టీటీడీ చరిత్రో బ్లాక్ డే: అమర్నాథ్

    తిరుపతిలో తొక్కిసలాట టీటీడీ చరిత్రలో బ్లాక్ డే.. ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చేయడంలో ఏపీ ప్రభుత్వం, టీటీడీ విఫలమయ్యాయి: మాజీ మంత్రి అమర్నాథ్

  • 09 Jan 2025 12:15 PM (IST)

    తిరుపతికి బయల్దేరిన సీఎం చంద్రబాబు..

    అమరావతి నుంచి తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు.. అమరావతిలో సీఎంవో అధికారులతో చంద్రబాబు సమావేశం.. తిరుపతి తొక్కిసలాట ఘటన, ప్రస్తుత పరిస్థితిపై చర్చ.. తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు చేరిన నివేదిక.. ఎవరి వల్ల తప్పిదం జరిగిందనే అంశంపై చర్చ.. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్న సీఎం..

  • 09 Jan 2025 12:11 PM (IST)

    టీటీడీ అలర్ట్..

    నిన్నటి ఘటనతో టీటీడీ మరింత అప్రమత్తం.. తిరుపతి బైరాగిపట్టెడ రామానాయుడి స్కూల్ దగ్గర మళ్లీ టికెట్ కౌంటర్.. తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాతో మూడు క్యూలైన్లు ఏర్పాటు.. టికెట్ల కోసం రామానాయుడు స్కూల్స్ దగ్గరకు వస్తున్న భక్తులు.. ఈ నెల 12న రాత్రి టికెట్లు ఇస్తామని చెప్పిన అధికారులు.. వైద్య సిబ్బందితో పాటు అంబులెన్సులను సిద్ధంగా ఉంచిన అధికారులు.. మరోసారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జారీ..

  • 09 Jan 2025 11:54 AM (IST)

    తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు..

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు.. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట ఘటనపై ఈస్ట్ పీఎస్ లో నారాయణపురం ఎంఆర్ఓ ఫిర్యాదు.. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్ఓ ఫిర్యాదు..

  • 09 Jan 2025 11:51 AM (IST)

    నేడు తిరుపతికి మాజీ సీఎం జగన్

    మధ్యా్హ్నం 3గంటలకు తిరుపతికి మాజీ సీఎం జగన్.. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్న జగన్..

  • 09 Jan 2025 11:47 AM (IST)

    ప్రమాదమా.. కుట్ర కోణామా: మంత్రి అనిత

    తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ప్రమాదమా.. కుట్ర కోణామా అనే విషయం విచారణలో తేలుతుంది.. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జగకుండా చూస్తాం.. హోంమత్రి అనిత

  • 09 Jan 2025 11:44 AM (IST)

    రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

    తిరుపతి రుయా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రులు.. జరిగిన ఘటనను మంత్రులకు వివరించిన కలెక్టర్, ఎస్పీ.. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..

  • 09 Jan 2025 10:35 AM (IST)

    మృతుల బంధువుల కన్నీటి పర్యంతం..

    తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీలో 3 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. మార్చురీ దగ్గర మృతుల బంధువుల కన్నీటి పర్యంతం..

  • 09 Jan 2025 10:32 AM (IST)

    టీటీడీ, పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట: సీపీఐ రామకృష్ణ

    టీటీడీ, పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట ఘటన జరిగింది.. ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఛైర్మన్ చెబుతుంటారు.. కానీ, సామాన్య భక్తుల పరిస్థితి ఏమైందో మనం చూశాం.. వీఐపీలకు మాత్రమే పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు.. ఘటన ప్రాంతంలో చాలా విశాలంగా ఉంది.. పోలీసులు లేకుంటే ఘటన జరిగేది కాదు.. ఎవరికి వారు క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు.. భక్తులను కట్టడి చేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ

  • 09 Jan 2025 10:27 AM (IST)

    చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ..

    చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.. ప్రభుత్వ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట ఘటన.. తక్షణమే టీటీడీ ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలి: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

  • 09 Jan 2025 10:25 AM (IST)

    భక్తులకు సౌకర్యాలు కల్పించని టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలి: భూమన

    భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించని టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకుని తిరుగుతున్న పవన్ ఇప్పుడేం చేస్తున్నారు.. అన్ని నీతులు మాట్లాడతారు.. కానీ ఒక్కటి అమలు చేయరు.. తిరుమలను చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారు.. లడ్డూ విషయంలో జగన్ పై, వైసీపీ నేతలపై అనేక నిందలు మోపారు.. : భూమన

  • 09 Jan 2025 10:21 AM (IST)

    ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలి: భూమన

    తిరుమలలో భక్తుల సౌకర్యాలను పట్టించుకునే వారే లేరు.. నిన్న తొక్కిసలాట సమయంలో 10 మంది పోలీసులు కూడా లేరు.. చంద్రబాబు పర్యటన కోసం వేలాది మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.. తొక్కిసలాటకు చంద్రబాబుబాధ్యత వహించాలి: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

  • 09 Jan 2025 09:55 AM (IST)

    తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

    కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీరు, లోపాలపై అధికారులతో చర్చించనున్న సీఎం.. సమావేశం తర్వాత తిరుపతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..

  • 09 Jan 2025 09:53 AM (IST)

    తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్

    మధ్యాహ్నం 3గంటలకు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్.. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్..

Show comments