NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala

Tirumala

Tirumala: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 79521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40152 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

Read Also: Bride Suicide: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య..

అయితే, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గరుడ సేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో రాకపోకలను నిలిపివేయనున్నాట్లు ప్రకటించారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.