NTV Telugu Site icon

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..

Tirumala

Tirumala

Tirupati Laddu Controversy: తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నేడు మూడు బృందాలుగా ఏర్పాడి సిట్ విచారణ చేయనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలుగా దర్యాప్తు చేయనున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి ఎంక్వైరీ చేయనున్న సిట్. టీటీడీ బోర్డ్ దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాల లోతుగా దర్యాప్తు చేయనున్నారు. అలాగే, తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలను సిట్ అధికారులు తెలుసుకోనున్నారు.

Read Also: ArshadWarsi : మరోసారి ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు..

ఇక, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్‍ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్‍ లిమిటెడ్‍ సంస్ధను తమిళనాడులోని దుండిగల్‍ వెళ్లి ఓ బృందం దర్యాప్తు చేయనుంది. అలాగే, మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకలను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. ఇంకో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్‍ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలన చేయనుంది.

Show comments