Site icon NTV Telugu

Leopard: హడలెత్తిస్తున్న చిరుతలు.. తిరుమల, తిరుపతిలో కలకలం

Leopard

Leopard

Leopard: టెంపుల్ సిటీ కేంద్రంగా శ్రీవారి భక్తులను, నగరవాసులను చిరుతలు హడలెత్తిస్తున్నాయి… నిత్యం తిరుమల, తిరుపతిలో చిరుతల సంచారం కంటిమీదా కునుకులేకుండా చేస్తున్నాయి‌‌.. నిన్న తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. తిరుమల శిలాతోరణం వద్ద నిన్న సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తాజాగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గత రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.

Read Also: Pooja Hegde: దాని నుంచి బయటపడటానికి సమయం పడుతుంది : పూజా హెగ్డే

Exit mobile version