PSLV-C59: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది.. ఇప్పుడు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈస్ఏ), భారతదేశంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. రేపు మరో ప్రయోగం చేయనుంది.. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.. ఈ రోజు మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. 25.05 గంటల పాటు కొనసాగనుండగా.. అనంతరం రేపు సాయంత్రం 4.08 గంటలకు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. ఈ PSLV-C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన probha-3 అనే 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రయోగించనుంది ఇస్రో.. రేపు సాయంత్రం 4.08 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను ప్రయోగించే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోన్నట్టు ఇస్త్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Also: Bangladesh: బంగ్లా హిందూ సన్యాసి తరుపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు..