NTV Telugu Site icon

Varahi Declaration: సనాతన ధర్మం డిక్లరేషన్ ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం.. కీలక అంశాలు ఇవే..!

Declarestion

Declarestion

Varahi Declaration: తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తాయి.. సనాతన ధర్మాన్ని దూషణ చేసే వారికి కోర్టుల రక్షణ కల్పిస్తున్నాయన్నారు. అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు. సనాత ధర్మం వైరస్ వంటిదని దాన్ని నాశనం చేస్తానని ఓ యువ నాయకుడు అన్నారు.. ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి.. నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. కానీ, సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా, శ్రీరాముడిని పాద రక్షలతో కొట్టినా సరస్వతి అమ్మవారిని తిట్టినా ఏం చేసినా ఒక్క కోర్టు మాట్లాడదు.. అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు భయపడతాయి.. ఇది న్యాయానికి ఉదాహరణ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

Read Also: Iran Israel: ఇరాన్ vs ఇజ్రాయిల్.. యుద్ధం వస్తే, ఎవరి సైనిక బలం ఎంత..?

సనాతన డిక్లరేషన్స్..
* ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
* సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
* సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
* సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
* సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
* ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
* ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి.. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Show comments