Huge Rush In Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు తిరుమల కొండకు. వీకెండ్ కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు తరలి రావడంతో ఐదు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే, నిన్న శ్రీవారిని 74, 344 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 169 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి హుండీ ఆదాయం 2.5 కోట్ల రూపాయలు వచ్చింది.
Read Also: Group 1 Mains 2025: ఏపీలో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు..
మరోవైపు, ఆటోవాలాలు, జీపులు, సెక్యూరిటీలకు శ్రీవారి మెట్టు టైమ్ స్లాట్ టోకెన్లు కౌంటర్ వరంగా మారింది. టైమ్ స్లాట్ టిక్కెట్లు తీయిస్తామంటూ భక్తులను శ్రీవారి మెట్టుకు తరలిస్తున్నారు. దీంతో ఆటోలు, జీపులతో శ్రీవారి మెట్టు మార్గం కిక్కిరిసిపోవడంతో వారిమెట్టు మార్గంలో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయింది. ఆటోలతో శ్రీనివాస మంగాపురం గ్రామం నిండిపోయింది. ఉదయం 6 గంటలకు గేట్లు తెరుస్తారనగా అర్థరాత్రి 12 గంటల నుంచి ఆటోలు బారులు తీరుతున్నారు. తిరుమలకు చేరుకోకుండానే భక్తులను ఆటో, జీపు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది నిలువు దోపిడి చేస్తున్నారు.
