Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక, క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది.
Read Also: PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్.. నేడు శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్
అయితే, శనివారం అర్ధరాత్రి వరకు 78,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, కానుకల రూపంలో హుండీలో రూ. 3.45 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల సమయం పడుతుండగా.. క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు సుమారు 5 గంటల్లో ఆ శ్రీనివాసుడి దర్శనం లభిస్తోంది.