LV Subrahmanyam: ఈరోజు (ఆగస్టు 3న) ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవారిని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గంటసేపట్లోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయించడం అసంభవమని అన్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
Read Also: POCSO case: మహిళ పై పోక్సో కేస్ నమోదు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే
అయితే, ప్రస్తుతం ఉన్న విధానానికి మించి శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదని మాజీ టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదని సూచించారు. అమలు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని టీటీడీకి సూచించారు. దీనికి బదులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించాలని కోరారు.