Duvvada Srinivas and Divvala Madhuri: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కడంతో.. తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ సాగింది.. ఓవైపు దువ్వాడ వాణి.. మరోవైపు దివ్వెల మాధురి.. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్.. ఇలా హాట్ హాట్‌గా సాగింది ఎపిసోడ్.. దువ్వాడ కొత్త ఇంటి విషయంలోనే వివాదం చెలరేగిందనే చర్చ సాగింది.. ఆ ఇంటి ముందు దువ్వాడ వాణి తన కుతుళ్లు, బంధువులతో సహా ఆందోళనకు దిగితే.. ఏకంగా ఆ ఇంట్లోకే ఎంట్రీ ఇచ్చింది మాధురి.. దీంతో.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. అయితే, నేను దువ్వాడకు ఇచ్చిన డబ్బుల కిందకు తనకు ఈ ఇల్లు రాసిచ్చారు అంటూ.. ఓ వీడియో విడుదల చేసింది.. దాంతో.. ఆ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది..
Read Also: Walking Everyday: ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఇప్పుడు ఉన్నట్టుండి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అది స్కూటర్‌ను ప్రమోట్ చేసేందుకు.. చేసిన వీడియో అయినా.. రకరకాల ఆడియో సాంగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేశారు నెటిజన్లు.. ఇక, ఇప్పుడు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు.. శ్రీవారిని దర్శించుకుని.. తిరుమాడ వీధుల్లో తిరుగుతోన్న వీడియోలు.. ఫొటోలులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఇంతకాలం గుట్టుగా ఉన్నవాళ్లు.. ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. ఇక దాచేది ఏమీలేదు.. అంతా ఓపెన్ అంటున్నారు.. కాగా, గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి పలు ఆలయాలకు కలిసి వెళ్లిన విషయం విదితమే.. కానీ, ఇప్పుడు తిరుమలలో ఈ జంట వీయోలు వైరల్ అవుతున్నాయి..