Bomb Threat: టెంపుల్ సిటీ తిరుపతిని వరుసగా బాంబు బెదిరంపులు టెన్షన్ పెడుతున్నాయి.. స్థానికులతో పాటు.. తిరుమలకు వచ్చే భక్తులు ఈ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే పలుమార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం.. అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. వెంటనే తనిఖీలు నిర్వహించి.. అలాంటివి ఏమీ లేవని తేల్చడం జరిగిపోగా.. తాజాగా, తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్లు హోటళ్లను తనిఖీ చేయగా.. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు..
Bomb Threat: తిరుపతిలో మళ్లీ కలకలం.. 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు
- తిరుపతిలో మరోసారి కలకలం..
- 9 హోటళ్లకు బాంబు బెదిరింపులు..
- రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా బెదిరింపు మెయిల్స్..