NTV Telugu Site icon

AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. స్పీకర్‌గా నేను అవకాశం ఇస్తా..

Ayyanna Patrudu

Ayyanna Patrudu

AP Speaker Ayyanna Patrudu: వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్టపరిధిలో వ్యవహరిస్తామ్మన్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు‌.. తిరుపతి ఎస్వీ జూపార్కును సందర్శించిన స్పీకర్.. ఎమ్మెల్యేతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు అయ్యన్న. ఇక, అసెంబ్లీ లో 80 మంది కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారని.. వారందరికీ ప్రత్యేక శిక్ష తరగతులు నిర్వహిస్తామన్నారు‌‌. ‌రాష్టంలో పచ్చదనం పెంపొందించడానికి చర్యలు చేపడుతామని.. అపార్ట్‌మెంట్, మిద్దిల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తాన్నారు‌ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.

Read Also: Prabhas Fauji: ఇంట్రెస్టింగ్‭గా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా అప్డేట్..

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదియ్యాలి.. అలాంటి వారిని ప్రశ్నించాలని సచించారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాటన్నారు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. పచ్చదనాన్ని పెంపొందిస్తూ ప్రతి ఇంటా రెండు మొక్కలు నాటేలా ప్రభుత్వంప్రోత్సహించాలి అన్నారు.. పచ్చదనాన్ని పెంపొందించకపోతే మానవ మనగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.. వాతావరణంలో ప్రకృతి వైపరీత్యాల లోపం వల్లే అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అపార్‌మెంట్లలో కూడా చిన్నచిన్న మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో నర్సరీలోని ఏర్పాటు చేసి, తద్వారా మొక్కల పెంపకాన్ని మహిళా సంఘాలకుఅప్పగిస్తూ తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తాను అన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు..

Show comments