NTV Telugu Site icon

Times Now Survey: ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే.. వైసీపీదే ఘనవిజయం

Times Now Survey Ycp

Times Now Survey Ycp

Times Now Navbharat Survey Says That YCP Will Win With Huge Margin In 2024 AP Elections: 2024 ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే రాబోతున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. దీంతో.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ నవభారత్ తాజాగా ఓ సంచలన రిపోర్ట్‌ని వెల్లడించింది. ‘జన్ గన్ కా మన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించిన ఈ సంస్థ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే, వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ప్రకటించింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కి 24 లేదా 25 వస్తాయని ఆ సర్వేలో తెలిపింది. అంతేకాదు.. దేశంలోనే వైసీపీ అతిపెద్ద మూడో పార్టీగా అవతరించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..

ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం.. సున్నా నుంచి ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ నవభారత్ తన నివేదికలో తెలిపింది. అంతకుమించి ఆ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇక జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకైతే.. ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఓటు శాతం చూసుకుంటే.. వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రావొచ్చని, టీడీపీకి 35-36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా పార్టీలకు అంతంత మాత్రమే ఓట్లు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడం, మేనిఫెస్టోకి కట్టుబడి ఉండటం వల్ల.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని అంచనా వేసింది. కాగా.. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. 22 లోక్‌సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది.

Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్