NTV Telugu Site icon

TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

Ttd

Ttd

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆన్‌ లైన్‌ ద్వారా ఈ టికెట్లను విడదుల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో పాటు రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్‌ నెలకు చెందిన ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.

అయితే.. నేడు తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 9 గంటల సమయం పడుతున్న అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 34,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే స్వామి వారికి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

 

Show comments