కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో కర్నూలు మండలం గార్గేపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గార్గేపురంలో కొంత కాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ ఎస్సీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్‌రెడ్డి వర్గం చేయిచేసుకుంది. దీంతో వినయ్ రెడ్డి ఇంటిపై ఎస్సీలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్, ఇంటి సామాగ్రి ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Bhumana Karunakar Reddy: ఆనాటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతల ఫోన్‌లను ట్యాప్ చేసింది