Weather Update: ఈరోజు పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు తక్కువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో ఉపరితల గాలులు పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 84గా నమోదైంది.
Read also: Vishweshwar Reddy: ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు
ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకటి, రెండు చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
Sriya Reddy: ఈ లుక్ సలార్ సినిమాలోదా లేక OGనా మేడమ్?
