NTV Telugu Site icon

Parvathipuram: పాలకొండలో రెచ్చిపోయిన దొంగలు .. దిశా ఎస్సై ఇంట్లో చోరీ

Untitled 4

Untitled 4

సామాన్య ప్రజల ఇల్లలో దొంగతనం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పాపం పోలీసులు కష్టపడి ఘటన స్థలానికి చేరుకోవాలి.. అదే పోలీసు ఇంట్లోనే దొంగతనం చేస్తే ఆ సమస్య ఉండదు. పోలీలీసులను ఇబ్బంది పెట్టినట్లు ఉండదు అనుకున్నాడేమో గాని ఏకంగా ఎస్సై ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి పార్వతీపురం జిల్లా లోని పాలకొండ లోని దిశా ఎస్సై ఇంట్లో అలానే ఓ కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్సై ఇంట్లో అందినకాడికి దోచుకున్నారు. అనంతరం కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగతనానికి యత్నించారు. అయితే కానిస్టేబుల్ ఇంట్లో ఏమి దొరకకపోయేసరికి నిరాశగా వెనుదిరిగారు.

Read also:Delhi: పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ చేసిందని, సోషల్ మీడియాలో మహిళ ఫోటోలు

కాగా దిశ పోలీసు స్టేషన్ ఎస్సై లావణ్య పాలకొండ డీఎస్పీ ఆఫీసుకు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆమె ఆ రాత్రి జిల్లా కేంద్రంలోనే ఉండిపోయారు. కాగా ఎస్సై తల్లి సైతం ఊరెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడం చేత దొంగలు చేతివాటం చూపించారు. కాగా తెల్లవారాక ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగింటి వారు ఎస్సైకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై హుటాహుటీన ఇంటికి చేరుకొని చూడగా ఇంట్లో నుంచి రూ.30 వేలు క్యాష్, తులం బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. కాగా పాలకొండలో ఒకే రోజు మూడు ఇల్లలో దొంగతనాలు జరగగా వాటిలో రెండు ఇల్లు పోలీసులవి కావడమే గమనార్హం.

Show comments