NTV Telugu Site icon

పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాజకీయ నేతల్లో మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించి వైసీప ఎమ్మెల్య అమర్‌నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర చేతుల్లో ఉందని ఈ నేపథ్యంలో పవన్‌ బీజేపీ ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు.

కానీ వైపీసీ ప్రభుత్వంపై పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రైతులకు వ్యతిరేకంగా భావించి వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలు రైతులకు న్యాయం చేసే చట్టాలంటూ పవన్‌ మాట్లాడారని.. పవన్‌కు వ్యవసాయ చట్టాలపై చిత్తశుద్ధి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా బీజేపీతో పొత్తుపెట్టుకోకముందు బీజేపీపై విరుచుకుపడ్డ పవన్‌ ఇప్పుడెందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారన్నారు.

YCP Counter to Pawan Kalyan Live | MLA Gudivada Amarnath Press Meet Live | Ntv Live