Site icon NTV Telugu

AP High Court: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల్లో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులు.. స్పందించిన హైకోర్టు

Untitled 7

Untitled 7

Andhra Pradesh: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగింది అంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రమాణ పత్రం దాఖలు చేసారు. కాగా ఆ పత్రంలో గతంలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదు అంటూ తిరస్కరించారని పేర్కొన్నారు. అలానే గతంలో అభ్యర్థులందరి ఎత్తు తమ సమక్షంలోనే తీసుకుంటాము అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పిటీషనర్లందరూ సిద్ధంగా ఉన్నారు అని అయన హైకోర్టుకు నివేదించారు. 2019లో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై గతంలో హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి.

Read also:Telangana Elections: ఎగ్జిజ్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ తరువాత ఎస్ఐ ఫలితాలు నిలుపుదల చేయాలి అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ క్రమంలో ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. కాగా అభ్యర్థులు ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రతి అభ్యర్థిని హైకోర్టుకు రావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదేశాలకు అనుగుణంగా అందరి అభ్యర్థుల తరపున పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రమాణ పత్రం దాఖలు చేసారు. కాగా పిటిషనర్లు అందర్నీ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Exit mobile version