Nandyala: సాధారణంగా విద్యార్థుల మధ్య కొన్ని సార్లు మనస్పర్థలు రావడం సహజం.. ఆ తరువాత అవన్నీ మర్చిపోయి అందరూ కలిసిపోవడం సహజం.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇపుడు కాలం మారింది. కలిసి కట్టుగా ఉండాల్సిన విద్యార్థులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చదువుకుంటారని తల్లిదండ్రలు పిల్లలను కళాశాలకు పంపిస్తే.. ప్రస్తుతం కళాశాలకు వెళ్లిన కొందరు విద్యార్థులు చదువుకోవడం మానేసి.. ఘర్షణలకు పాల్పడుతున్నారు. అయితే విద్యార్థుల మధ్య తలెత్తుతున్న ఘర్షణలకు విసుగిపోయారేమోగాని..కళాశాల యాజమాన్యం విచక్ష కోల్పోయారు. ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను దండించడానికి వాళ్ళకి గుండు గీయించారు. అలానే కొందరు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన నాధ్యాలలో చోటు చేసుకుంది.
Read also:Rishab: నేను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలి పోను… శెట్టి కౌంటర్ ప్రశాంత్ నీల్ కేనా?
వివరాలలోకి వెళ్తే.. సోమవారం రాత్రి నాధ్యాల జిల్లా లోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కాగా విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ కళాశాల యాజమాన్యం దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాల యాజమాన్యం విద్యార్థులను దండించే క్రమంలో కర్రలతో విద్యార్థులను కొట్టారు. దీనితో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఓ విద్యార్థికి చెయ్యి విరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలానే కళాశాల యాజమాన్యం.. ఘర్షణకు పాల్పడిన మరో 6 మంది విద్యార్థులకు శిరోమండనం చేయించారు. విద్యార్థుల పైన ఆ కళాశాల యాజమాన్యం స్పందించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుకి యదా రాజా తదా ప్రజా అన్నట్లు అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.