NTV Telugu Site icon

Thammineni Seetharam: స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ ఇక ప్యాకప్..!

Thammineni Seetharam

Thammineni Seetharam

తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం… టీడీపీ ఇక ప్యాకప్ అనేశారు.. పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారు… అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు అని ఫైర్‌ అయిన ఆయన.. పొలిటికల్ ఫిలాసఫీతో సీఎం జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తున్నారని తెలిపారు.. పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి.. ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారని.. కానీ, గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్‌ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Read Also: BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌కు బీజేపీ డెడ్‌లైన్‌..

గ్రామంలో పరిపాలన ఉండాలనే, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి పాలనను డీసెంట్రలైజ్ చేశారని ప్రశంసలు కురిపించారు తమ్మినేని సీతారాం… ఎందరు కలిసినా జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేరు.. గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టే అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ ఇతర టీడీపీ నాయకులూ సమర్ధిస్తారా? అని అడుగుతున్నా… మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. చట్టం తన పని తను చేస్తుంది… విచారణ జరిపి చర్యలు తీసుకుంటానన్నారు.

రాజకీయ మధ్యవర్తి లేకుండానే పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయన్న తమ్మినేని.. మా ముఖ్యమంత్రి పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదు.. పవిత్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజలలో కన్ఫ్యూజన్ చేయడానికి సర్కస్ ఫీట్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.