NTV Telugu Site icon

Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్

Kkd Hospital

Kkd Hospital

కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు,ఎం.ఎస్ రాజు, పీతల సుజాత ,
పిల్లి మాణిక్యాలరావు వున్నారు. వీరు కాకినాడ చేరుకోవడం పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ పై అనర్హత వేటు వేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఘటనపై సి బీ ఐ విచారణ చేయాలి. ఎమ్మెల్సీ బోగస్ సర్టిఫికెట్ పొంది పదవి పొందాడు. మన్యం ప్రాంతాన్ని దోచుకుంటున్నాడు. 302 కింద కేసు పెట్టి అనంత బాబు ను అరెస్ట్ చేయాలి. దళితుడిని హత్య చేశాడన్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలున్నాయని సోదరుడు నవీన్ తెలిపారు. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.

ఏ ధైర్యంతో డ్రైవర్ సుబ్మహ్మణ్యాన్ని చంపి కారులో తీసుకు వచ్చాడు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి జవహర్. అనంత బాబు ను పదవి నుండి తప్పించాలి. జాతీయ స్థాయి లో ఈ విషయాన్ని తీసుకు వెళ్తామన్నారు. టీడీపీ నేత ఎం ఎస్ రాజు మాట్లాడుతూ.. కాకినాడ రౌడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మృతుడు కుటుంబంతో రెండు కోట్లు ఇస్తామని బేర సారాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ గా ఒప్పుకోమని చెప్తున్నాడన్నారు. సెక్షన్ 174 ను 302 గా మార్చాలని, అనంత బాబు ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోస్ట్ మార్డం జరగాలంటే ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్ లు మార్చాలి. పోలీసులకు అనంత బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ ముద్దాయిలకు కొమ్ము కాస్తుందన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. మేము ఎంత వరుకు అయినా వెళ్తామన్నారు. ముద్దాయిని కాపాడ్డానికి పోలీసులు రాజకీయాలు చేస్తున్నారు. మరో వైపు పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో టీడీపీ నేత ఎంఎస్ రాజుకి అస్వస్థత కలిగింది. ఆయన్ని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్పీ అప్పారావు కొట్టాడు అంటున్నారు టీడీపీ నేతలు.

అనంతబాబుని సీఎం ఎందుకు కాపాడుతున్నారని, ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.

Driver House: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి తాళం