Site icon NTV Telugu

Amaravati Maha Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలని వైసీపీ నినాదాలు

Mlc 1

Mlc 1

గత వారం రోజులుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పడుతున్నారు. రంగురంగుల బెలూన్లతో పాదయాత్ర జరిగే రోడ్ల వెంట అమరావతి రైతులు నినాదాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి చేరుకుంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. అయితంపూడి గ్రామంలో నిరసన చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. దీంతో అమరావతి మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల పాదయాత్రలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ నేతలు మధ్య తోపులాట జరిగింది. ఒకే రాజధాని అంటూ టీడీపీ నేతలు మూడు రాజధానులు కావాలని వైసీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. MLC అంగర రామ్మోహనరావు కాళ్ళు మొక్కి మరీ 3 రాజధానులు కావాలని నిరసన వ్యక్తం చేశాడో వైస్సార్సీపీ కార్యకర్త.

టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాదయాత్ర ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా వుంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఇరగవరం మండలంలో రోడ్డు పొడవునా వైసీపీ(YCP) భారీస్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ తణుకు నియోజకవర్గ వైస్సార్సీపీ నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలు కూడా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

Exit mobile version