Site icon NTV Telugu

Ukraine Students: స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్ధులు

ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని తమ తమ ప్రాంతాలకు వెళుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు 23 మంది తెలంగాణ విద్యార్థులు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ… ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరారు విద్యార్ధులు. హైదరాబాద్ శంషాబాద్ లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థిని రిసీవ్ చేసుకున్నారు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయి స్కందనను రిసీవ్ చేసుకున్నారు పత్తికొండ తహశీల్ధార్. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా రావడానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపింది స్కందన.

ఉక్రెయిన్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు విద్యార్థులకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానం లో బయలు దేరిన విద్యార్థులు గన్నవరం చేరుకున్నారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో వంశీ (గుంటూరు),అభిషేక్ (తెనాలి) ఫర్జానా (కానూరు), అనూష (కౌతవరం) గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో స్వగృహానికి చేరారు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధినులు. సుష్మా, సుదర్శనలను రిసీవ్ చేసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉక్రెయిన్ వెస్ట్రన్ లో తాము వున్నామని, అక్కడ యుధ్ధం ప్రభావం అంతగా లేదన్నారు విద్యార్ధినులు. ఈస్ట్రన్ ఉక్రెయిన్ లో యుధ్ధం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మా యునివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగాం. ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉండిపోయారు.

https://ntvtelugu.com/what-is-father-of-all-bombs-how-its-working/

సైరన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని, అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్ధినుల తల్లిదండ్రులు. బెంగళూరు విమానాశ్రయంలో దిగారు చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ఉక్రెయిన్ విద్యార్థులు. వీరిని రిసీవ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. అక్కడి నుంచి సొంత ఊరు చేరుకునేందుకు వాహన సదుపాయం కల్పించారు అధికారులు.

Exit mobile version