Site icon NTV Telugu

Minister Srinivas Goud: దుర్గమ్మ సేవలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. బీఆర్ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Srinivas Goud

Minister Srinivas Goud

Minister Srinivas Goud: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను.. దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. రాష్ట్ర విభజన ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు లేకుండా ఉన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతాయి అన్నారు‌.. జరిగాయా? అని ప్రశ్నించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్న ఆయన.. కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా వెళ్లాలని అమ్మవారిని కోరుకున్నట్టు వెల్లడించారు..

Read Also: CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు.. ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలి

ఇక, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్‌ను రెవెన్యూ భవన్ లో గజమాలతో సత్కరించారు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు నేతలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో ఏపీ వాళ్లకు ఇబ్బందులు వస్తాయని తప్పుడు ప్రచారం చేశారు.. కానీ, సీఎం కేసీఆర్ పాలనతో అందరూ కలిసిమెలిసి ఉన్నారని గుర్తుచేశారు.. ఉభయరాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉన్నామన్న ఆయన.. ఇక, బీఆర్‌ఎస్‌ విస్తరణపై మా నాయకుడు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మంచి అధికారిని నియమించారన్న ఆయన.. దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా కేసీఆర్ స్పందిస్తున్నారు.. రాజస్థాన్ లో రైతుల సమస్యలు పైనా కేసీఆర్ స్పందించారని వెల్లడించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.

Exit mobile version