CM Chandrababu: మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమోంటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – పైడిపల్లి ప్రాజెక్ట్ హోల్డ్.. లైన్లోకి సల్మాన్!
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ లో అద్భుతంగా అధికారులు పని చేశారని ప్రశంసించారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామన్నారు. తుఫాన్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ చేశాం.. యువ ఐఏఎస్ అధికారుల టీంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Nizamabad: మహిళల వరుస హత్యలు.. మొండెం లేని లేడీ మృతదేహం కలకలం..
అలాగే, పంట నష్టంపై రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ అలర్ట్ వచ్చినప్పటి నుంచే ట్రాకింగ్ పెట్టాం.. అవేర్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామన్నారు. ఈ టెక్నాలజీతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. 10 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకు రాగలిగాం అన్నారు. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ఇద్దరు మాత్రమే మృతి చెందారని సీఎం చంద్రబాబు తెలిపారు.