ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది… గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఆయన బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్.. దీంతో అప్రమత్తమైన పైలట్.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరం ల్యాండ్ చేశారు.. సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం.. తిరిగి సాయంత్రం 5.26 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండైంది.. దీంతో, గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. ఇక, సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అయితే, రేపు దౌత్యవేత్తలతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ – కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది.. దీని కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ రాత్రికి హస్తినకు చేరుకోనున్న ఆయన.. రేపు ఉదయం పదిన్నరకు లీలా ప్యాలెస్ హోటల్‌కు చేరుకోవాలి.. అక్కడ పలు దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర వరకు సమావేశం కొనసాగనుంది.. సమావేశం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు సీఎం జగన్ చేరుకోవాల్సి ఉండగా.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి నివాసం చేరుకోవాల్సి ఉంది.. ఇక, మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనున్న విషయం విదితమే..