TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!

  • ఏపీ మున్సిపల్ ఎన్నికలు
  • టీడీపీ రెండో జాబితా రిలీజ్
  • మేయర్ అభ్యర్థిగా షేక్ అబిదా
Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రెండో జాబితాను విడుదల చేసింది. ఒక కార్పోరేషన్, 21 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు మొత్తం 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ అభ్యర్థిగా షేక్‌ అబ్దుల్‌ అబిదాను ప్రకటించింది. మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్ల అభ్యర్థులు.. ఆకివీడు-నిలోఫర్ షేక్, బేతంచెర్ల-లోకేష్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెం-దొడ్ల విజయలక్ష్మీ, చీరాల-స్పందన, డోన్ -కోట్ల సుజాతమ్మ, గుత్తి-గోవిందరాజులు, గుంతకల్లు-యశోద.

జంగారెడ్డిగూడెం-రొంగల అనూష, కదిరి-షేక్ సమీరా, కళ్యాణ దుర్గం-బుట్న లక్ష్మీ, కొండపల్లి-కన్నెకంటి అమూల్య, కొవ్వూరు- జొన్నలగడ్డ రాధారాణి, నాయుడుపేట-షకీరా, నందిగామా-శాకమూరి వంశీధర్, నందికొట్కూరు-సుబురున్నిసా, నర్సీపట్నం- చింతకాయల పద్మావతి, ప్రొద్దుటూరు- నంద్యాల రాఘవ రెడ్డి, వెంకటగిరి- దొంతు శారద, ఉయ్యూరు -చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, ఏలేశ్వరం- యార్లగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు- మాచాని సునీత. తెలుగుదేశం పార్టీ శుక్రవారం తొలి జాబితా విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.