రేణిగుంట: టీడీపీ శ్రేణుల ర్యాలీలో రసాభాస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ ర్యాలీ కాసేపటికే రసాభాసగా మారిపోయింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసరడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందిన పలువురు దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసేశారు. కాగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు.
Also Read
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!