Site icon NTV Telugu

TDP : ప్రజా గళం సభకు ఏర్పాట్లు పూర్తి..

Prajagalam

Prajagalam

పల్నాడు లో ప్రజా గళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహిస్తున్న భారీ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి… …. చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రాంతంలో నేడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే తొలి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు… ఈ సభలో ఉమ్మడి పార్టీల అధినేతలు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు పాల్గొని ప్రసంగిస్తారు … లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు . .300 ఎకరాల ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదిక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు… ఈ సభ ద్వారా 2024 ఎన్నికల ప్రచార నగరా మోగించడానికి ఉమ్మడి పార్టీలు సంసిద్ధమవుతున్నాయి…

భారీ సెట్టింగ్లు …ఐదు హెలిపాడ్లు ,యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అవుతున్న తాత్కాలిక రోడ్లు.. ఇది ప్రస్తుతం చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రాంతంలో జరుగుతున్న ప్రజాగలం సభకు చేస్తున్న ఏర్పాట్లు…… ఎన్నికల ప్రచారం భాగంలో నరేంద్ర మోడీ పల్నాడు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి ….ప్రజాగాళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ,జనసేన ని పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై ప్రసంగిస్తారు ….రాష్ట్రంలో పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో కూటమికి ఎందుకు ఓటు వేయాలని అంశంపై ప్రజలను ఉద్దేశించి ముగ్గురు నేతలు ప్రసంగించనున్నారు…. ఈ నేపథ్యంలో భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

 

రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4000 మంది సిబ్బందితో ప్రధానమంత్రికి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు… ఏడుగురు ఐపీఎస్ అధికారులు ప్రధాని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు…..ప్రధానమంత్రి రాకకు అనువుగా మూడు హెలిపాడ్లతో పాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు హెలిపాడ్ ను సిద్ధం చేసారు…. ఇప్పటికే ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు బొప్పూడి ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నాయి….. ప్రధానమంత్రి ప్రయాణించే హెలికాప్టర్లు ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి చేసుకున్నయి….నేషనల్ హైవే కి ఆనుకొని బొప్పూడి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది…. ప్రధానమంత్రి పర్యటనకు భద్రత అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారని, లక్షలాదిమంది ప్రజలు హాజరైన నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు 13 కమిటీలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని పార్టీ ల నాయకులు చెప్తున్నారు…..

Exit mobile version