NTV Telugu Site icon

TDP New Strategy: లోకేష్ చిట్ చాట్… వారికి షాకేనా?

Tdp40

Tdp40

తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం తెలుగుదేశం పార్టీ అనేవారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ వత్తిడిలో వుంది. 40 ఏళ్ళ పండుగను గర్వంగా జరుపుకుంటున్నామని చెబుతున్నా. భవిష్యత్ సవాళ్ళు టీడీపీ నేతల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండురోజుల మహానాడు జరుగుతోంది.

రాబోయే కాలం అంతా టీడీపీ నేతలకు పరీక్షా కాలమే అని చెప్పాలి. టీడీపీలో సంస్ధాగతంగా సంచలన మార్పులు రాబోతున్నాయా? మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేష్ ఏం చెప్పారు? ఆయనిచ్చిన సంకేతాలేంటి? ఇప్పుడివే అంశాలు టీడీపీ నేతల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్స్ అంటున్నారు. చాలా కాలం క్రితమే చంద్రబాబు పొలిట్ బ్యూరోలో ఈ విషయాన్ని చెప్పేశారంటున్నారు లోకేష్.

పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్దాంతం అమలుకు ప్రయత్నం జరుగుతోంది. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవి బ్రేక్ తీసుకోవాల్సిందే. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి నేను బ్రేక్ తీసుకుంటాను. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే.. కొత్త రక్తం ఎలా వస్తుంది..?అంటున్నారు యువనేత, మాజీ మంత్రి లోకేష్.

ఇది నా బలమైన కోరిక.. పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించా. పార్టీలో దీనిపై చర్చ జరుగుతోంది.ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది.ఈలోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తాం.30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ లైనులోకి రావడం లేదు.పని చేయని నేతలకు.. ఇన్ఛార్జులకు అవకాశాలుండవు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావిస్తున్నా.కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు తిరిగి దండం పెడితే చాలు గెలిచిపోయే పరిస్థితి ఉందన్నారు లోకేష్.

పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తెస్తాం. మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. వివిధ శాఖలకు చెందిన మంత్రులు.. పార్టీ సంబంధిత అనుబంధ విభాగాలతో చర్చించి నిర్ణయాలు తీసుకునేలా చూస్తాం.పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తామంటున్నారు లోకేష్. నలభై ఏళ్ళ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పరిణతి చెందిన విధానాలను అనుసరించాలని అధిష్టానం భావిస్తే పార్టీకి పూర్వ వైభవం గ్యారంటీ అంటున్నారు టీడీపీ నేతలు.

Somireddy ChandramohanReddy: జగన్ హయాంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం