Site icon NTV Telugu

AP Assembly: స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..

పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్‌ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్‌ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. దీంతో, ప్రశ్నోత్తరాల అనంతరం పెగాసెస్ పై చర్చకు స్పీకర్ అనుమతించారు.. మరోవైపు, ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులు.. దీనిపై స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు.

Read Also: AP Assembly: సభలో గందరగోళం.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

పెగాసెస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ స్పీకర్‌ తమ్మినేనికి రాసిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.. పెగాసెస్ స్పై వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని లేఖలో గుర్తుచేసిన ఎమ్మెల్యేలు… అవాస్తవాలపై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇదే పెగాసెస్ అంశంపై లోక్ సభలో చర్చ అవసరం లేదని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. ఇక, వైఎస్‌ వివేకా హత్య, డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేయడానికి సభని వేదికగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.. సభ గౌరవం కాపాడాలని స్పీకర్‌ను లేఖలో కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు.

Exit mobile version