Site icon NTV Telugu

Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు..?

Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.. ఈరోజు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్‌.. ఇక, గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే టీడీపీ అసభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసిన విషయం విదితమే కగా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.. సుప్రీం పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదు..? పాత గవర్నర్‌ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం అలాంటి తప్పే ఇవాళ మళ్లీ చేసిందన్నారు.

Read Also: Somu Veerraju: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. దానిపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి..

ఇక, గవర్నర్‌తో ముఖ్యమంత్రి ని పొగిడించటమేంటి? అని నిలదీశారు పయ్యావుల.. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా ? అని ఎద్దేవా చేశారు. ప్రథమ పౌరుడితో సీఎంని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.. గవర్నర్‌ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారు.. ఇది సభా నిబంధనలకు విరుద్ధం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి.. కానీ, శాంతి భద్రతల అంశం ఎక్కడా గవర్నర్‌ ప్రసంగంలో లేదన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్‌తో చెప్పించే ప్రయత్నం చేశారు.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్‌తోనూ రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.

మరోవైపు.. గవర్నర్‌ ప్రసంగంపై టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టం 10 ఏళ్ల కాల పరిమితి ముగుస్తున్నా, గవర్నర్ ప్రసంగంలో దానిపై ప్రస్తావన లేదని విమర్శించారు. ఈ ఎన్నికల కాలానికి పోలవరం పూర్తికాదనే అసమర్ధతను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్న ఆయన.. అసత్యాలు చదవలేక అనేకసార్లు గవర్నర్ కూడా ఇబ్బంది పడ్డారన్నారు నిమ్మల.. ఇక, గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రంగుల పిచ్చ, పేర్ల పిచ్చ తప్ప మరేం లేదని విమర్శలు గుప్పించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తన చేత ఇన్ని అసత్యాలు పలికించినందుకు గవర్నర్ కూడా ఇంటికి వెళ్లి బాధపడి ఉంటారన్న ఆయన.. వివిధ పథకాలకు సంబంధించి గవర్నర్‌తో ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారడీయేనని కొట్టిపారేశారు.

Exit mobile version