Site icon NTV Telugu

Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే

Untitled Design (6)

Untitled Design (6)

భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. “బైబిల్, భవద్గీత, ఖురాన్ వల్ల మన జీవితాలు మారలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్లనే ప్రజల జీవితాలు మారిపోయాయన్నారు.

Read Also:Online Fruad: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..

అయితే ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవద్గీతపై ఆయన చేసిన కామెంట్లను తీవ్ర స్థాయిలో ఖండించారు. వెంటనే ఆయన్ను టీటీడీ బోర్డు మెంబర్ నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజుకు హిందూ సంప్రాదాయాలపై నమ్మకం లేదని.. టీటీడీ మెంబర్లను నియమించేటపుడు.. వారికి హిందూమతం పట్ల, భవద్గీత పట్ల , హిందూ సాంప్రదాయల పట్ల గౌరవం ఉందో లేదో.. ఒకటికి రెండుసార్లు పరీక్షించాలని సీఎం చంద్రబాబుని రాజాసింగ్ కోరారు.

Read Also:IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి

అనంతరం .. ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. “ఎంఎస్ రాజు ఎమ్మెల్యే మాత్రమే కాదు.. టీటీడీ బోర్డు సభ్యుడు కూడా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతను ఆయన తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం.. ఎంఎస్ రాజు వెంటనే హిందూవులకు క్షమాపణ చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.

Exit mobile version