Site icon NTV Telugu

Gorantla Buchaiah Chowdary: పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దిగజారుతోంది

Gorantla

Gorantla

రాబోయే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం. ఎన్నాళ్లు ఈ దుర్మార్గం. న్యాయవ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే చూస్తూ ఊరుకోం అన్నారాయన. ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, చంద్రబాబు ఎక్కడ టిక్కెట్టు ఇచ్చిన పోటీకి సిద్దం అని ప్రకటించారు.

Read Also: Russia: పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య..

ఇప్పటికి నేను యువకుడినే. అధికార పక్షం కౌరవుల పక్షాన పోరాడుతుంటే మేము పాండవులు పక్షాన పోరాడుతున్నాం అన్నారు గోరంట్ల. అమెరికాలో అన్ని పక్షాల వారిని కలుసుకున్నాం. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ్గపు పాలనపై ఎన్ ఆర్.ఐ లు విసుగు చెందారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగపనంపమని కోరుతున్నారన్నారు. అమెరికా పర్యటన వివరాలను మీడియాకు వివరించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గోరంట్ల ఓటింగ్ కు దూరంగా వున్న సంగతి తెలిసిందే.

ఆ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికాలో పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కేవలం 4 స్థానాలు మాత్రమే లభించాయి. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. పార్టీ ఓటమి చెందాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా వున్నారు గోరంట్ల. ఒకానొక సందర్భంలో పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, చంద్రబాబు జరిపిన చర్చలతో బుచ్చయ్య చౌదరి శాంతించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడినించి పోటీచేస్తారనేది ఉత్కంఠగా వుంది.

Read Also: Jyothula Naveen: పార్టీ కోసమే పనిచేస్తున్నా… కమిట్మెంట్ తో వున్నా

Exit mobile version