NTV Telugu Site icon

Gorantla Madhav Video Call Leak Issue: గోరంట్ల మాధవ్‌ రాజీనామాకు టీడీపీ నేతల డిమాండ్..

Gorantla Madhav

Gorantla Madhav

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఎంపీ మాధవ్‌కు సంబంధించినదంటూ ఓ అశ్లీల వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇక, దానిపై స్పందించిన వైసీపీ ఎంపీ.. అది మార్ఫింగ్‌ చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు.. వారే కుట్రపూరితంగా నా ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ నేతలు.. తక్షణమే ఎంపీ పదవితో పాటు.. వైసీపీ నుంచి కూడా మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి..

Read Also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..

దేశంలో ఒకవైపు అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు, మరోవైపు జెండా పండగలు జరుగుతున్నాయి.. ఏపీలో మాత్రం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న ప్రదర్శనలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ఇలా సరస సల్లాపాల్లో పాల్పంచుకుంటూ రేప్ కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం సీఎం జగన్ కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.. కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపి ఉండాల్సిందన్న ఆయన.. వైసీపీ ప్రవర్తన, వాడుతున్న భాష చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్ని ప్రజలకు తెచ్చారన్నారు.. ఒకప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ… ఈ రోజు వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీలకు కేరాఫ్ గా మారడం దురదృష్టకరం అన్నారు సోమిరెడ్డి.

ఎంపీ మాధవ్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత… హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని నాన్చి నాన్చి సస్పెండ్ చేస్తున్నాం అని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిన ఎంపీపై ఇంకా ఏ చర్యా లేదు? అని నిలదీశారు.. తక్షణమే అతడితో మహిళలకు క్షమాపణ చెప్పించి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు అనితి.. ఇక, వైసీపీ నేత‌లు మ‌ద‌మెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద ప‌డి మ‌హిళ‌ల మాన‌ ప్రాణాలు తీస్తున్నారు.. ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిపై సీఎం జగన్ క‌నీస చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని ఆరోపించారు అయ్యన్నపాత్రుడు.. మ‌హిళ‌లపై లైంగిక‌ దాడుల‌కి పాల్ప‌డిన‌ వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. వైకామ‌కేయుల్ని ఊరి మీదకి వ‌దిలి దిక్కులేని దిశ‌చ‌ట్టం తెచ్చారు.. మ‌హిళ‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌? అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. వైఎస్సార్సీపీ అంటే యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ అని ఎద్దేవా చేశారు.. ఆ పార్టీ పేరుని సార్థ‌కం చేసే మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ అని విమర్శించారు.. వైఎస్సార్సీపీ ఆశీస్సుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ అవంతి అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌ట‌కొస్తే.. వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదు. పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాస‌లీల‌లు చేయ‌డం కాదు, బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్‌గా మ‌హిళ‌ని సెక్సువ‌ల్ హెరాస్ చేస్తూ వీడియో వ‌దిలారని సెటైర్లు వేశారు.. ఇప్పుడు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకుంటారో, అంబ‌టిలా ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తారో చూద్దాం? అని రాసుకొచ్చారు బుద్దా వెంకన్న. ఇక, ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తక్షణమే ఎంపీ పదవితోపాటు వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు మాజీ మంత్రి జవహర్.. గతంలో అంబాటి, అవంతిలపై చర్యలు తీసుకుని ఉంటే నేడు గోరంట్ల మాధవ్ ఇలా వ్యవహారించి ఉండేవాడు కాదని హితవుపలికిన ఆయన.. గోరంట్ల మాధవ్ చేసిన చర్యను ఒక సామాజిక వర్గానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజం తలదించుకునే పరిస్థితుల్లో వ్యవహారిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహారిస్తున్నారో వారందరిపైన జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు.

ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన గోరంట్ల మాధవ్‌ ఎపిసోడ్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ ని ఈ సమాజం నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.. గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేయాలి, మాధవ్ లాంటి కామ పిశాచులను తరిమి కొట్టాలన్నారు. మరోవైపు, అస్లిల సాహిత్యాన్ని ఒప్పుకొని భారత దేశంలో ఎంపీ న్యూడ్ ప్రదర్శనతో భారత సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఆ ఎంపీ పేరు తలవడానికి కూడా మనసు రావడం లేదన్న ఆయన.. రాష్ట్రపతి ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని ఎంపీ చేష్టలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఎంపీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్నాం, ఎంపీని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని.. సీఎం జగన్ దిశ చట్టాన్ని ఎంపీ మీద పెట్టాలని డిమాండ్‌ చేశారు ఆలపాటి. ఇక, ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికే అనర్హుడు.. మాధవ్ తక్షణమే రాజీనామా చేయాలి.. ఇలాంటి వ్యక్తులను పార్లమెంటుకు ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు నక్కా ఆనంద్ బాబు.. రేప్ కేసులో నిందితుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయితే ఇలాంటి ఘన కార్యాలు చూడాల్సి వస్తుందన్న ఆయన.. లోక్ సభ స్పీకర్ తక్షణమే గోరంట్ల మాధవ్ ను డిస్ క్వాలీఫై చేయాలని కోరారు.. రాజకీయమంటే ఆంబోతులా రంకెలు వేయడం కాదు మాధవ్.. నీచాతీ నీచంగా వ్యవహారించి మా పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు పేలటానికి సిగ్గు ఉండాలి అంటూ ఫైర్‌ అయ్యారు.

Show comments