NTV Telugu Site icon

సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీనేత.. అలా జరిగితే టీడీపీ మూసేస్తాం..

రోజురోజుకు ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధ తారస్థాయి చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబుది కొంగ జపం అంటున్న మంత్రి పేర్ని నానికి పచ్చ కామెర్లు వచ్చాయి. చంద్రబాబును విమర్శిస్తున్న పేర్ని నాని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. జగన్‌ది బలుపు కాదు వాపు.

స్థానిక ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ముచ్చెమటలు పట్టిస్తాం. ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తాం. మద్యం షాపుల దగ్గరకు వైసీపీ నేతలు వెళితే.. పట్టాభిని మించిన స్థాయిలో బూతులు జగన్ గురించి వినొచ్చు’ అని విమర్శించారు.

అంతేకాకుండా ‘తొత్తు లాంటి డీజీపీని పెట్టుకుని అధికారం చెలాయిస్తున్నారు. ఏంట్రా కొడాలి నాని గడ్డి తినే మాటలేంటీ..? అని జనం అనుకుంటున్నారు. చంద్రబాబు, లోకేషును వదిలితే ఏదో పీకుతానంటున్న కొడాలి.. ఏం పీకుతాడు..? ఈడేమన్నా పెద్ద పీకుడు గాడా..?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మంత్రి పదవి కోసం ఏదో తిట్టాడు.. ఇంకా ఎందుకీ తిట్లు. త్వరలోనే కొడాలి నాని పదవి పోయి ముండలా ఇంట్లో కూర్చొబోతున్నారు. ఉప్పు కారం మీరే తింటున్నారా..? మేమూ తింటున్నాం.. బీపీ మాకూ వస్తుంది’ అంటూ ధ్వజమెత్తారు.