Site icon NTV Telugu

Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌.. ఇవాళ ఐటీ విచారణ

Gudivada Casino

Gudivada Casino

Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చిన విషయం విదితమే… ఈ కేసులో ఇవాళ ఆదాయపన్నుశాఖ (ఐటీ) విచారణ చేపట్టనున్నారు.. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది.. గుడివాడ క్యాసినో అంశమై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వివిధ సంస్థలకు అటే సీబీడీటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.. ఇక, టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ.. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను పిలిచారు ఐటీ అధికారులు.. దీంతో.. ఇవాళ విజయవాడలోని ఐటీ అధికారులను కలవనున్నారు వర్ల రామయ్య.. కాగా, కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో టీడీపీ ఆందోళనలు కూడా నిర్వహించిన విషయం విదితమే.. సంక్రాంతి పండుగ సందర్భంగా కే కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కొన్ని వైరల్‌గా మారిపోయాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ క్యాసినో జరిగిందని ఆరోపించారు టీడీపీ నేతలు. అయితే, టీడీపీ ఫిర్యాదుతో.. మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చినట్టు అయ్యింది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version