Site icon NTV Telugu

నగర అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం : పట్టాభి

TDP Leader Pattabhi

ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది. నగర విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగింది. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించింది. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓఆర్ఆర్ ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని గడ్కరీనే చెప్పారు అని తెలిపారు. ఫీజబులిటీ నివేదిక కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే నిర్మాణానికి సిద్ధమని కేంద్రం చెప్పింది. ప్రభుత్వం మాత్రం 78కి.మీ విజయవాడ బైపాస్ ఇస్తే సరిపోతుందని చెప్పారు అన్నారు.

https://ntvtelugu.com/joe-root-goes-past-sachin-tendulkar-in-elite-list/

అయితే మంత్రి పేర్నినాని బ్లాక్ టిక్కెట్ మంత్రి అని పట్టాభి చెప్పారు. బెంజ్,బెట్టింగ్ మంత్రులతో పాటు ఇప్పుడు బ్లాక్ టిక్కెట్ మంత్రి వచ్చాడు. పేర్నినానికి బైపాస్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి తేడా తెలియదు. విషయ పరిజ్ఞానం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా. మీరు నిశానీ బ్యాచ్ అని అందరికీ తెలుసు అన్నారు. లగే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసింది చంద్రబాబా…? రాజశేఖర్ రెడ్డా…!?. వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు. ఓఆర్ఆర్ ను రియల్ ఎస్టేట్ కోసం అష్టవంకర్లు తిప్పిన ఘనత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానిది. ఔటర్ రింగ్ రోడ్డును చెత్త బుట్టలో పడేసిందని పేర్ని నానీ నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారు. భారత్ మాల కింద అమరావతి, విజయవాడ రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం అని 2019లో రఘురామ కృష్ణ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఓఆర్ఆర్ వద్దు బైపాస్ మాత్రం కావాలని కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ధి విధ్వంసం అని పేర్కొన్నారు పట్టాభి.

Exit mobile version