ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్.. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో పర్యటించిన ఆయన.. నిన్న కత్తుల దాడిలో గాయపడిన కుటుంబాలను పరామర్శించారు. వైసీపీ వర్గీయులు దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఎస్సైకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. ఇక, ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్.. గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎలాంటి గొడవలూ లేవన్న ఆయన.. ఇప్పుడు మాత్రం తమ్మినేని ఎవరి పై కేసులు పెట్టమంటే పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. తమ్మినేని సీతారాం ఓ సిగ్గుమాలిన వ్యక్తి అంటూ మండిపడ్డ కూన రవి… గ్రామాల్లో పర్యటనలు గాడిదలుకాయడానికి చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీకు చేతకాక ఊరకుక్కలతో మాట్లాడిస్తున్నావు అంటూ కామెంట్ చేసిన ఆయన.. అబ్బాకొడుకుల సంగతి చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం.. తమ్మినేని, తమ్మినేని కొడుకు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
స్పీకర్, ఆయన కుమారుడిపై టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు

Kuna Ravikumar