ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రోజూ మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. తాజాగా ఏపీ విభజన వివాదం రాజుకుంది. వైసీపీ నేతలు ఏపీ, తెలంగాణ కలిసి పోతే స్వాగతిస్తామని కామెంట్లు చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదటగా స్వాగతించేది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ, మా ప్రభుత్వ విధానమని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సజ్జల సమైక్య కామెంట్లపై స్పందించింది టీడీపీ.
Read Also: Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సజ్జల సలహాలతో జగన్ పాలనతో రాష్ట్రంలో పీకల్లోతున కూరుకు పోయింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు తీరని ద్రోహం చేసింది. విభజన కేసులు మూసేయాలన్న తాజా అఫిడవిట్ తో రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల ఆస్తులు చేజేతులా వదులుకున్నట్టైంది. ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకు వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించింది వైసిపినే అన్నారు. షెడ్యూలు 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది జగన్ రెడ్డి కాదా..?
ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని పార్లమెంటులో టీడీపీ ఎంపిలు పోరాటం చేస్తే ఆ సమయంలో లోక్ సభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విభజనకు మద్దతు తెలపలేదా..? రాష్ట్ర విభజన అడ్డుకున్నందుకు టీడీపీ ఎంపీలపై తెలంగాణ ఎంపీలు భౌతిక దాడులకు దిగితే జగన్ రెడ్డి మౌనంగా ఉండి.. వారికి మద్దతివ్వలేదా..? బెంచి కింద దాక్కుని విభజన వాదులకు మద్దతు తెలిపిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? పూటకో మాట, ప్రాంతానికో విధానం… వెరసి అవకాశవాదమే వైసీపీ ఎజెండా అని ఎద్దేవా చేశారు కళా వెంకట్రావు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అటు తెలంగాణ లోనూ టీఆర్ఎస్ నేతల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
Read Also: Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
